ముగ్గురు సీఎంల రహస్య సమావేశంలో ఏ ఒప్పందాలు జరిగాయి?: హరీశ్ రావు

Harish Rao asks what agreements happened in secret meeting of three CMs
  • చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ భేటీపై హరీష్ స్పందన
  • తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చారిత్రక ఒప్పందం అని రేవంత్ అంటున్నారని విమర్శ
  • శిష్యుడు సీఎం అయ్యాడని చంద్రబాబు గుండ్రేవులను తీసుకొస్తున్నారని ఆరోపణ
కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్) జరిపిన రహస్య సమావేశంలో ఏ ఒప్పందాలు జరిగాయని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో సీఎంలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కూడా లోపలికి రానీయకుండా నలుగురు మాత్రమే కూర్చుని ఏం చర్చించారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఆంధ్రప్రదేశ్‌లో గుండ్రేవుల ప్రాజెక్టులు ముందుకు వెళుతుంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'చారిత్రక ఒప్పందం' అంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

గతంలో గుండ్రేవులను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని... కానీ ఇప్పుడు ఏపీ సీఎం తన ‘శిష్యుడు’ రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడనే ధీమాతో మళ్లీ ఆ ప్రాజెక్టును తీసుకురావడం జరుగుతోందని ఆరోపించారు. ఆర్‌డీఎస్‌కు స్పష్టమైన నీటి కేటాయింపులు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించిన హరీష్ రావు... రేవంత్ రెడ్డికి నీటి వాటాలపై కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ సగటున 4 టీఎంసీలు మాత్రమే తెచ్చుకుంటే, బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఏడాది 44 టీఎంసీల చొప్పున అనుమతులు తెచ్చుకున్నామని గుర్తు చేశారు.“మనకు రావాల్సిన 968 టీఎంసీలలో 830 టీఎంసీలకు అనుమతులు తెచ్చుకున్నాం. ఇంకా 138 టీఎంసీలు రావాలి. రేవంత్ రెడ్డి తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు” అని వ్యాఖ్యానించారు.
Harish Rao
Revanth Reddy
Chandrababu Naidu
Gundrevula project
Telangana water rights
Karnataka CM meeting

More Telugu News