అమరావతిలో పేర్ని నాని తదితర వైసీపీ నేతలపై కోడిగుడ్లతో దాడి
- అమరావతి భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు
- గో బ్యాక్ వైసీపీ అంటూ కూటమి సానుభూతిపరులు, రైతుల అడ్డగింత
- లేళ్ల అప్పిరెడ్డి వాహనంపై రాళ్లు రువ్విన రైతులు
ఈ క్రమంలో వైసీపీ నేతలపై కోడిగుడ్లు కూడా విసిరారు. లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వడంతో వాహనం దెబ్బతిన్నట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నా ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులపై కూడా రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.