మహారాష్ట్రలో మరో 24 గంటల్లో టెట్ పరీక్ష.. ప్రశ్నపత్రం లీక్‌!

Maharashtra TET Paper Leak Just 24 Hours Before Exam
  • పరీక్షకు 24 గంటల ముందే టెట్‌ ప్రశ్నపత్రం లీక్‌
  • ఠాణేలో పోలీసుల తనిఖీలు.. ప్రశ్నపత్రం స్వాధీనం
  • కేసులో పలువురు అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆదివారం జరగాల్సిన టెట్‌ పరీక్ష వాయిదా
  • కొత్త పరీక్ష తేదీని త్వరలో ప్రకటించే అవకాశం
పరీక్షకు సరిగ్గా 24 గంటల ముందు ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో మహారాష్ట్రలో టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) వాయిదా పడింది. ఠాణేలో జరిగిన పోలీసుల తనిఖీల్లో ప్రశ్నపత్రాన్ని స్వాధీనం చేసుకోగా.. ఈ వ్యవహారంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వారి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై మహారాష్ట్ర విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రెస్‌నోట్‌ రూపంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే కొత్త పరీక్ష తేదీని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Maharashtra TET
Paper Leak
Thane Police
Teacher Eligibility Test
Exam Postponed
Maharashtra Education Department

More Telugu News