5,000mAh బ్యాటరీతో శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ఫోన్.. ఫీచర్లు ఇవే
- గెలాక్సీ ఏ27 5జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ
- జులై 3 నుంచి విక్రయాలు ప్రారంభం
- స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్
- 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ తెర
- ఆరేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ-O డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దీంతో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటాయని శాంసంగ్ తెలిపింది. పనితీరు కోసం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను అందించింది.
ఏఐ ఫీచర్లలో సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, గూగుల్ జెమినీ, పర్‌ప్లెక్సిటీ, బిక్స్‌బీ వంటి సేవలను పొందుపర్చింది. ఒకే ఫొటోలోని పలు వస్తువులను ఒకేసారి సెర్చ్ చేసే సదుపాయం కూడా ఉంది. 22 భాషలను సపోర్ట్ చేసేలా వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను ఇచ్చింది.
ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం శాంసంగ్ నాక్స్, నాక్స్ వాల్ట్ రక్షణ వ్యవస్థలను అందించింది. అలాగే ఆరు ఆండ్రాయిడ్, వన్ యూఐ అప్‌డేట్లు, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది. బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.