కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను: కృతి సనన్
- 'కాక్‌టెయిల్-2'తో భారీ హిట్ కొట్టిన కృతి సనన్
- తన తొలి ఫొటో షూట్, ర్యాంప్ వాక్ రెండూ ఫ్లాప్ అయ్యాయని వెల్లడి
- టాలెంట్ లేకపోయినా కొందరు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా అవకాశాలు పొందుతున్నారని విమర్శ
“ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డాను. మోడలింగ్ రోజుల్లో నా మొదటి ఫొటో షూట్, మొదటి ర్యాంప్ వాక్ రెండూ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. ఇంటికి వెళ్లి ఏడ్చాను. కానీ ఆపకుండా మళ్లీ ఆడిషన్లు చేశాను. ఆ పట్టుదలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది” అని గుర్తు చేసుకుంది.
అంతేకాదు, బాలీవుడ్‌లోని నెపోటిజం పైనా కృతి తీవ్రంగా స్పందించింది. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లాంటి స్టార్ కిడ్స్ లో టాలెంట్ ఉందని, కష్టపడి నిరూపించుకున్నారని చెప్పిన కృతి... టాలెంట్ లేని కొందరు కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా 8-9 ఏళ్ల పాటు వరుసగా అవకాశాలు పొందడం అన్యాయమని మండిపడింది. బ్యాక్‌గ్రౌండ్ లేని నటీనటులు మొదటి 2-3 ఏళ్లలోనే హిట్‌లు కొట్టకపోతే ఇండస్ట్రీ వారిని పక్కకు నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.