వైరల్ అవుతున్న చిన్నారి ఆర్ణ వీడియో.. నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన 'ఐఏఎస్' ఆర్ణ వీడియో
- వెంకటేశ్ సినిమా డైలాగుతో వీడియో పోస్ట్ చేసిన తండ్రి
- ఆర్ణ వీడియోపై ఇన్స్టాలో స్పందించిన సీఎం చంద్రబాబు
- వీడియో చూసి నవ్వకుండా ఉండలేరంటూ సరదా కామెంట్
- చిన్నారి ఆర్ణకు తన మద్దతు ఉంటుందని వెల్లడి
ఇటీవల ఆర్ణ తండ్రి తన కుమార్తెకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నటుడు వెంకటేశ్ సినిమాలోని డైలాగులను బ్యాక్‌గ్రౌండ్‌లో జతచేసి ఈ వీడియోను రూపొందించారు. తన క్యూట్ హావభావాలతో ఆర్ణ ఆకట్టుకోవడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి మురిసిపోయారు.
ఈ వైరల్ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఆయన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందించారు. "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నారి ఐఏఎస్ ఆర్ణ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు" అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆర్ణకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్పందనతో ఈ వీడియో ఇప్పుడు మరింతగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న ఆర్ణకు, సీఎం నుంచి ప్రశంసలు దక్కడం విశేషం.