మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్

  • నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు
  • దేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
  • దేశానికి రాహుల్ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన రేవంత్

నేడు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం. ఏఐసీసీ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున బర్త్‌డే వేడుకలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. "మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయక నాయకుడైన రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, సామాజిక న్యాయం అందించడం, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిస్తున్న అచంచలమైన నిబద్ధత కోట్లాది మందికి నిరంతరం కొండంత స్ఫూర్తినిస్తోంది. ఆయన దేశానికి, దేశ ప్రజలకు ఇలాగే తన నిరంతర సేవలను కొనసాగించాలి. రాహుల్ గాంధీ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంతో, మరింత శక్తితో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను" అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.


రాహుల్ గాంధీ బర్త్‌డే సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ఉన్న గాంధీ భవన్ సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు కేకులు కట్ చేసి స్వీట్లు పంచుతున్నారు. పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదానాలు, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


Rahul Gandhi
Revanth Reddy
Telangana Congress
Rahul Gandhi Birthday
Gandhi Bhavan
Indian National Congress

More Telugu News