టర్కీలో తెలంగాణ యువతి మిస్సింగ్

Telangana
Advertisement
  • ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువతి
  • అమెరికా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • ఆచూకీ కోసం రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం
  • టర్కీలోని భారత కాన్సులేట్ సహాయాన్ని కోరిన అధికారులు
  • విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
Advertisement
అమెరికా నుంచి హైదరాబాద్‌కు వస్తూ టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తెలంగాణ యువతి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన బొక్క రాజశ్రీ ఆచూకీ లభ్యమయ్యేలా చొరవ చూపాలని తెలంగాణ ప్రభుత్వం ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ను కోరింది.

రాజశ్రీ అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసిన అనంతరం హ్యూస్టన్ నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. జూన్ 14న ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగిన ఆమె, అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే, ఆమె ఆ విమానం ఎక్కలేదని తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. హ్యూస్టన్ నుంచి బయలుదేరే ముందు తల్లికి సందేశం పంపిన రాజశ్రీ, అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీల్‌ఛైర్ సహాయంతో ప్రయాణిస్తున్న ఆమె ఆచూకీపై విమానాశ్రయ అధికారుల నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇటీవల తండ్రి మరణించడంతో రాజశ్రీ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ విషయాన్ని ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాజశ్రీని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని విన్నవించారు.

మరోవైపు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని కేంద్ర విదేశాంగ శాఖతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. దౌత్య మార్గాల ద్వారా ఈ పరిణామాలను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజశ్రీ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Bokka RajashreeTelangana woman missing TurkeyIstanbul airport missing caseIndian student missing Istanbul

More Telugu News

ఏపీలో మూడు చోట్ల భారీ భద్రత మధ్య రీపోలింగ్

02 Nov, 10:11

ఓబీసీ గణనపై తీర్మానం చేయండి: సీఎం రేవంత్‌కు కవిత బహిరంగ లేఖ

02 Nov, 10:09

పుట్టినరోజున నీతా అంబానీ గొప్ప సంకల్పం.. అనాథలు, వృద్ధుల కోసం 100 ఎకరాల్లో కేర్ టౌన్‌షిప్

02 Nov, 10:04

పంజాబ్‌లో ‘ఆప్’‌కు భారీ షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీలోకి జంప్!

02 Nov, 10:03

కనీసం నకిలీ ఫొటోలను కూడా సరిగా తయారు చేయలేకపోయారు.. కాంగ్రెస్‌ ఢిల్లీ చలో ర్యాలీపై బీజేపీ సెటైర్లు

02 Nov, 10:01

కేబుల్ బ్రిడ్జిపై మరో విషాదం.. దుర్గం చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

02 Nov, 09:43

20 నిమిషాల్లో రూ.52,000 కోట్లు ఆవిరి!.. బినాన్స్‌పై చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడి

02 Nov, 09:41

బీపీ మాత్ర మరిచిపోయారా? ఒక్క డోసు మిస్‌ అయితే ఏమవుతుందో తెలుసా?

02 Nov, 09:39

భువనేశ్వర్‌ను ఆడించి తప్పుచేశారు: సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్

02 Nov, 09:22

చైనా, రష్యాపై గూఢచర్యం చేస్తున్నాం.. వారికంటే మేమే బెటర్‌: ట్రంప్‌

02 Nov, 09:17

హార్దిక్ పాండ్యా కోసం కేకేఆర్ పట్టు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడుగుతున్న ముంబై!

02 Nov, 09:15

ఆస్ట్రేలియా వీసాకు కొత్త రూల్స్.. ఆ దేశానికి వెళ్లే భారతీయుల‌పై ప్రభావం ఎంత?

02 Nov, 08:58

ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు?.. అసలు కారణం చెప్పిన రాజమౌళి!

02 Nov, 08:54

యూపీఐ ఆల్ టైమ్ రికార్డ్.. రోజువారీ లావాదేవీలు లక్ష కోట్లు!

02 Nov, 08:37

షారుఖ్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ‘కింగ్’ సాంగ్ విడుదల

02 Nov, 08:35
..More Telugu News