క్రిస్టియానో రొనాల్డోపై విమర్శలు... మూడేళ్ల క్రితమే కోహ్లీ ఏం చెప్పాడంటే..!
- ప్రపంచకప్ 2026 తొలి మ్యాచ్‌లో రొనాల్డో పేలవ ప్రదర్శన
- 41 ఏళ్ల రొనాల్డోపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- గతంలో రొనాల్డో గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి
- రొనాల్డో ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని కీర్తించిన విరాట్ కోహ్లీ
- విమర్శలతో రొనాల్డో మరింత రాటుదేలుతాడని అంచనాలు
ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం నిరాశాజనకంగా ప్రారంభమైంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్ తర్వాత ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డోపై విమర్శల వర్షం కురుస్తోంది. పోర్చుగల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న రొనాల్డో, తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక నీరసంగా కనిపించాడు. అంతర్జాతీయంగా 143 గోల్స్ చేసి రికార్డు సృష్టించిన ఈ దిగ్గజం ఆటతీరుపై ఒక్క మ్యాచ్‌తోనే పండితులు, అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అతడిని జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే స్థాయికి చర్చ చేరింది.
ఈ తీవ్రమైన విమర్శల నేపథ్యంలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గతంలో రొనాల్డో గురించి చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సరిగ్గా ఇలాంటి విమర్శలనే తన కెరీర్‌లో ఎదుర్కొన్న కోహ్లీ, రొనాల్డో విషయంలో ప్రపంచాన్ని హెచ్చరిస్తూ పలు సందర్భాల్లో తన అభిమానాన్ని, మద్దతును చాటుకున్నాడు.
2022లో ఖతార్ ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించినప్పుడు రొనాల్డో కన్నీటి పర్యంతమవ్వగా, కోహ్లీ స్ఫూర్తిదాయక సందేశాన్ని పోస్ట్ చేశాడు. "ఏ ట్రోఫీ లేదా టైటిల్ కూడా ఈ క్రీడకు మీరు చేసిన సేవను, ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని తగ్గించలేదు. ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు పొందే అనుభూతిని ఏ టైటిల్ వివరించలేదు. అది దేవుడిచ్చిన వరం. ప్రతిసారీ తన పూర్తిస్థాయిలో హృదయంతో ఆడే వ్యక్తికి ఇది నిజమైన ఆశీర్వాదం. క్రీడాకారులందరికీ మీరు నిజమైన స్ఫూర్తి. నా దృష్టిలో మీరే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్" అని కోహ్లీ పేర్కొన్నాడు.
అంతేగాక 2023లో రియాద్ ఆల్-స్టార్స్ తరఫున ఆడిన రొనాల్డో.. మెస్సీ, నెయ్‌మార్, ఎంబాపె వంటి స్టార్లు ఉన్న పీఎస్‌జీ జట్టుపై రెండు గోల్స్ చేశాడు. అప్పుడు కూడా కోహ్లీ స్పందిస్తూ.. "ఇప్పటికీ 38 ఏళ్ల వయసులో అత్యున్నత స్థాయిలో ఆడుతున్నాడు. ప్రతి వారం అటెన్షన్ కోసం అతడిని విమర్శించే నిపుణులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ప్రపంచంలోని టాప్ క్లబ్‌లలో ఒకదానిపై ఇలాంటి ప్రదర్శన చేసిన తర్వాత కూడా మాట్లాడరేం. అతడు ముగిసిపోయాడన్నారు కదా?" అని విమర్శకులకు చురకలు అంటించాడు.
రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ లేదా జువెంటస్‌లో ఉన్నప్పటి ఆటగాడు కాదనేది వాస్తవం. కానీ, 2025-26 సీజన్‌లో అల్-నసర్ తరఫున 30 మ్యాచ్‌లలో 28 గోల్స్ చేశాడనే విషయాన్ని విమర్శకులు విస్మరిస్తున్నారు. ప్రస్తుతం అతని సమస్య సామర్థ్యం కాదు, వేగవంతమైన యూరోపియన్ లీగ్‌లలో ఆడే సహచరులతో సరైన సమన్వయం లేకపోవడమే.
రొనాల్డో, కోహ్లీ ఇద్దరూ తమ కెరీర్‌లో ఇలాంటి విమర్శలను ఎదుర్కొని, తమ ఆటతోనే సమాధానం చెప్పినవారే. కోహ్లీ ఎలాగైతే విమర్శలను తిప్పికొట్టి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడో, రొనాల్డో కూడా తనపై వచ్చే ప్రతి విమర్శను ఒక సవాలుగా తీసుకుని, రాబోయే మ్యాచ్‌లలో తనదైన శైలిలో చెలరేగి, విమర్శకుల నోళ్లు మూయిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.