ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత..!
- మొత్తం 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక
- తొలి విడతలో న్యూస్ విభాగంలో వందల కొద్దీ ఉద్యోగులపై వేటు
- ఆర్థిక ఒత్తిళ్లు, లైసెన్స్ ఫీజు తగ్గడమే ప్రధాన కారణం
- డిజిటల్ సేవలపై దృష్టి సారించేందుకు కొత్త డైరెక్టర్ జనరల్ నిర్ణయం
ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. వ్యయ నియంత్రణ ప్రణాళికలో భాగంగా, వచ్చే వారం తన వార్తా విభాగం నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థవ్యాప్తంగా మొత్తం 2,000 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తుండగా, అందులో ఇది మొదటి దశ కానుంది. ఈ మేరకు 'లైవ్ మింట్' ఓ కథనం వెలువరించింది.
గత కొంతకాలంగా బీబీసీ తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. లైసెన్స్ ఫీజు చెల్లించే వారి సంఖ్య తగ్గడం, ఫీజు చెల్లింపుల్లో ఎగవేతలు పెరగడం వంటి కారణాల వల్ల సంస్థ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో, రాబోయే రెండు మూడేళ్లలో 500 మిలియన్ పౌండ్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి భారీ స్థాయి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది.
బీబీసీ మొత్తం సిబ్బందిలో దాదాపు నాలుగో వంతు మంది వార్తా విభాగంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వార్తా విభాగానికి కేటాయించే బడ్జెట్లో 15 శాతం వరకు కోత విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాట్ బ్రిట్టిన్ బీబీసీ నూతన డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, యువతను ఆకట్టుకునేలా ఐప్లేయర్, యూట్యూబ్ వంటి డిజిటల్ సేవలపై మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
మరోవైపు, బీబీసీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టీవీ లైసెన్స్ ఫీజు వ్యవస్థపై యూకే ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తోంది. అయితే, ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియలో నాణ్యమైన జర్నలిజం దెబ్బతినకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.