మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth Reddy says Kishan Reddy is obstructing Hyderabad Metro expansion
  • కిషన్‌రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌పై రేవంత్‌ విమర్శలు
  • ఐఆర్‌ఎఫ్‌సీ రుణం నిలిపేశారన్న వాదన
  • ఎన్‌ఓసీ ఇస్తే చాలన్న సీఎం
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు
  • హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ
హైదరాబాద్‌ విస్తరణను అడ్డుకుంటుందని కేందమంత్రి జి. కిషన్‌ రెడ్డేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మెట్రో టేకోవర్‌ కావాల్సిన ఐఆర్‌ఎఫ్‌సీ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంతా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. కానీ, కిషన్‌రెడ్డి తన సహచర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. రుణం మంజూర్‌ కాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. 

జపాన్‌ నుంచి నిధులు కూడా వచ్చాయని రేవంత్‌ తెలిపారు. కానీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజకీయంగా నష్టం జరుగుతుందనే కుట్ర పన్నుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసే మెంట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాలపై కేంద్రాన్ని అడిగితే.. కింద సమస్యలు ఉన్నాయని తెలిపినట్లు వెల్లడించారు. మెట్రో విస్తరణకు రూ.40 వేల కోట్లు కావాలని, అంతా మేమే భరిస్తాం, కేవలం ఎన్‌ఓసీ ఇవ్వండి కేంద్రం భాగస్వామ్యం లేకుండా నిర్మిస్తామన్నాం. 

సమస్యలపై చర్చిద్దామంటే కిషన్‌రెడ్డి సమయం ఇవ్వట్లేదని రేవంత్‌ అన్నారు. ఆయనపై ఎలాంటి కోపం లేదని తెలిపారు. కేవలం ఆయన నుంచి సహకారం మాత్రమే కోరుకుంటున్నానన్నారు. అహ్మదాబాద్‌ మెట్రోకు అనుమతి, నిధులు ఇచ్చారని, విశాఖ మెట్రో నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, హైదరాబాద్‌ మెట్రోకు నిధులతో పాటు అనుమతులూ లేవని విమర్శించారు. అక్కడే వివక్ష ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు.

కేసీఆర్‌కు కిషన్‌ రెడ్డి లొంగిపోయారని రేవంత్‌ ఆరోపించారు. ఆయనకు అంత తెలివిలేదంటూ ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్‌ చెప్పినట్లు నడుచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన డైరెక్షన్‌లోనే కిషన్‌రెడ్డి వెళ్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మెట్రో నిర్మాణాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించలేదన్నారు. ఇప్పుడు దాన్ని సరిచేసుకుంటామంటే వివిధ రకాలుగా అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.
Advertisement
Revanth Reddy
Kishan Reddy
Hyderabad Metro Expansion
Telangana Government
Ashwini Vaishnaw
IRFC Loan

More Telugu News