తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం

Five year old girl kidnapped and raped while traveling with grandfather on bike
  • ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఘటన
  • ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బాలికను రక్షించిన పోలీసులు
  • నిందితుడు చందన్ కుమార్ షా అరెస్ట్  
  • పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఐదేళ్ల పసికందుపై జరిగిన ఘోర అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న బాలికను అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టిన ఒక కామాంధుడిని బలియా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే స్పందించిన పోలీసులు, బాలికను రక్షించి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 11 రాత్రి బాన్సడీ రోడ్డు కూడలి దాటిన తర్వాత ఓ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. బాలిక తాత అత్యవసర పని నిమిత్తం తన మోటార్ సైకిల్‌ను రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో వేరే బైక్‌పై అక్కడికి వచ్చిన నిందితుడు చందన్ కుమార్ షా (29) బైక్‌పై కూర్చుని ఉన్న ఐదేళ్ల చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ షాకింగ్ ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు అదే రోజున చిన్నారిని నిందితుడి బారి నుంచి రక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 65(2) (అత్యాచారం), పోక్సో (POCSO) చట్టంలోని కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. శనివారం ధేలహ్వా బాబా నుంచి దుభద్ వైపు వెళ్లే రహదారి సమీపంలో నిందితుడు చందన్ కుమార్ షాను అరెస్ట్ చేసి, నేరానికి వాడిన బైక్‌ను సీజ్ చేశారు. 
Go Back to Shorts
Chandan Kumar Shah
Ballia Police
Uttar Pradesh Crime
Minor Girl Kidnap Rape
POCSO Act Case
Bansdih Road Ballia

More Telugu News