రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు: యువతి సందిగ్ధతతో నెటిజన్ల సూచనలు
- సొంత ఇంటితో భద్రత కోరుకుంటున్నానని యువతి వెల్లడి
- బంగారం అమ్మి డౌన్‌పేమెంట్, మిగతాది 30 ఏళ్ల లోన్‌పై తీసుకోవాలని ప్లాన్
- ఇది భావోద్వేగ నిర్ణయమని, తొందరపడొద్దని హెచ్చరిస్తున్న నెటిజన్లు
- బంగారం స్త్రీధనమని, దాన్ని అమ్మి రిస్క్ తీసుకోవద్దని కీలక సూచనలు
నెలకు రూ.1.7 లక్షల వేతనం పొందుతున్న 25 ఏళ్ల యువతి, విడాకులు తీసుకుంటున్న తరుణంలో రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సలహా కోరుతూ ఆమె చేసిన పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు, ఇది తొందరపాటు నిర్ణయమని, దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
చెన్నైకి చెందిన ఈ యువతి, రెడిట్‌లోని 'పర్సనల్ ఫైనాన్స్ ఇండియా' అనే గ్రూపులో తన ప్రణాళికను వివరించింది. తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడం ద్వారా రూ.45 లక్షలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, మిగిలిన రూ.80 లక్షలను 30 ఏళ్ల కాలపరిమితితో గృహ రుణం ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. దీని కోసం నెలకు సుమారు రూ.55,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తన తల్లిదండ్రులు కూడా ఇటీవలే అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
సాంప్రదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను, విడాకుల అనంతరం పూర్తి స్వాతంత్ర్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. "నా కాళ్లపై నేను నిలబడాలి. భర్త లేదా తండ్రిపై ఆధారపడకుండా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. నా ఈ నిర్ణయం సరైనదేనా? లేక జీవితంలోని కష్టకాలంలో భద్రత, స్వేచ్ఛ కోసం ఆరాటపడుతూ ఈ ప్రయత్నం చేస్తున్నానా?" అని తన సందేహాన్ని వ్యక్తపరిచింది.
ఆమె పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లలో మెజారిటీ వర్గం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. "ప్రస్తుత తరుణంలో ఆస్తి కొనగోలు వద్దు. ఇప్పటికే స్థిరాస్తి ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. మరికొన్నేళ్లు వేచి చూసి, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టడం ఉత్తమం" అని ఒకరు సలహా ఇచ్చారు. విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ మరో యూజర్, "బంగారం మీ స్త్రీధనం. దానిని చట్టపరంగా ఎవరూ తీసుకోలేరు, కాబట్టి దానిని అమ్మి రిస్క్ తీసుకోవద్దు" అని సూచించారు. భారీ ఈఎంఐ భారం వల్ల పొదుపు, అత్యవసర ఖర్చులకు నిధులు ఉండవని పలువురు అభిప్రాయపడ్డారు.