'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే అడ్డుపడుతున్నారు: జగపతిబాబు ఫైర్

  • 'పెద్ది' సినిమాలో చరణ్ పోరాడి గెలిచాడన్న జగపతిబాబు
  • తొలి మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని వెల్లడి
  • ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయిందన్న జగ్గూ భాయ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో వచ్చిన 'పెద్ది' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీని తట్టుకుని, బాక్సాఫీస్ వద్ద బలమైన టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు జగపతిబాబు, దర్శకుడు బుచ్చిబాబుల మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రను పోషించిన జగపతిబాబు, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. 'పెద్ది' చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ఊపిరి పోస్తుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని జగపతిబాబు చెప్పారు. 


ఈ సినిమా ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతూ.. "ఈ సినిమాలో చరణ్ ఒక ఆట ఆడాడు, కష్టపడి పోరాడి గెలిచాడు. కానీ దురదృష్టవశాత్తూ నేటి పరిశ్రమలో గెలిచిన తర్వాత కూడా ఇంకా పోరాడుతూనే ఉండాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. 'చరణ్ ప్రతి షాట్‌లోనూ సిక్సర్ కొట్టాడు' అని కొనియాడారు. సినిమాను తొక్కేయడానికి కొందరు కావాలనే ప్లాన్డ్ నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


తొలిరోజుల్లో వచ్చిన బాక్సాఫీస్ రెస్పాన్స్‌పై జగపతిబాబు ఓపెన్‌గా స్పందించారు. మొదట రెండు మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని, అసలైన ప్రేక్షకులు థియేటర్లకు పూర్తి స్థాయిలో రాలేదని అంగీకరించారు. అయితే రోజులు గడిచేకొద్దీ మౌత్ టాక్ మారిపోయిందన్నారు. "ఇప్పుడు టాక్ పూర్తిగా పాజిటివ్‌గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వస్తున్నారు. సినిమా ఇంత బాగుంటే, కొందరు ఎలా ఇంత నెగిటివ్ ప్రచారం చేశారో అర్థం కావడం లేదని కొందరు నాతో అన్నారు" అని చెప్పారు.

Jagapathi Babu
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Telugu Cinema News
Peddi Box Office

More Telugu News