మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ
- మీనాక్షి పిటిషన్‌పై శుక్రవారం విచారణ
- ఎన్నికల ఫలితాలపై స్టేకు కోర్టు నిరాకరణ
- తెలంగాణ కేసు వివరాలపై వివాదం
- నామినేషన్ తిరస్కరణను సవాల్ చేసిన కాంగ్రెస్ నేత
మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు. తెలంగాణలోని ఓ ప్రైవేట్ ఫిర్యాదుకు సంబంధించి ఆమెకు కేవలం నోటీసు మాత్రమే జారీ అయిందని వివరించారు. ఆ వ్యవహారంలో కోర్టు ఇంకా కేసును విచారణకు స్వీకరించలేదని, ఛార్జిషీట్ కూడా నమోదు కాలేదని తెలిపారు.
దీన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని కాంగ్రెస్ వాదిస్తోంది. అందువల్ల నామినేషన్ పత్రాల్లో ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఆ దశలో సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి సింఘ్వీ తీసుకెళ్లారు.