నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్

Entertainment
Advertisement
  • తన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్ అని తెలిపిన పవన్ కల్యాణ్
  • స్కూల్ రికార్డుల్లో శ్రీ అనే పదాన్ని తొలగించి కె.కల్యాణ్ కుమార్ అని పెట్టారని వెల్లడి
  • పవన్ అనే పేరును తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టారన్న పవర్ స్టార్
Advertisement

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘పవర్ స్టార్’ అనే పేరు ఒక బ్రాండ్. ఆయన నడక, నడిచే స్టైల్, మాట్లాడే తీరు.. ఇలా ప్రతి ఒక్కటి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ఆయనే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. అయితే, ఆయన అసలు పేరు పవన్ కల్యాణ్ కాదు అనే విషయం మనలో చాలా మందికి తెలుసు. కానీ, ఆ పేరు ఆయనకు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను పవన్ కల్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.


పవన్ కల్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. "నేను పుట్టినప్పుడు మా ఇంట్లో బారసాల రోజు నాకు పెట్టిన అసలు పేరు 'శ్రీ కల్యాణ్ కుమార్'. కానీ, ఆ తర్వాత స్కూల్ రికార్డుల్లో చేర్చే సమయానికి ఆ 'శ్రీ' అనే పదాన్ని తొలగించి, కేవలం 'కె. కల్యాణ్ కుమార్' అని రిజిస్టర్ చేశారు" అని వెల్లడించారు. గతంలో ఆయన తల్లి అంజనా దేవి కూడా ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు అసలు పేరు కల్యాణ్ కుమార్ అని స్పష్టం చేశారు.


మరి కల్యాణ్ కుమార్ కాస్తా 'పవన్ కల్యాణ్' ఎలా అయ్యారనే దానికి ఆయన ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ చెప్పారు. "నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే విపరీతమైన పిచ్చి, ఆసక్తి ఉండేది. ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో నేను నమ్మశక్యం కాని కఠినమైన విన్యాసాలు చేసేవాడిని. నా ఛాతీపై వందల కిలోల బరువున్న బండరాళ్లను పెట్టుకుని, వాటిని సుత్తితో పగలగొట్టించేవాడిని. నా శారీరక దృఢత్వాన్ని, నాకున్న అంకితభావాన్ని చూసి.. నా మార్షల్ ఆర్ట్స్ గురువు నా పేరుకు ముందు 'పవన్' అనే పదాన్ని చేర్చారు" అని తెలిపారు. అలా గురువు ఇచ్చిన 'పవన్' అనే పేరును ఆయన స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్నారు. అదే పేరు కాలక్రమేణా టాలీవుడ్‌లో ఒక పెను తుపాను సృష్టించింది. ఆ తర్వాత అభిమానులు ఆయనకు ఇచ్చిన 'పవర్ స్టార్' అనే బిరుదు ఆయన పర్సనాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.


మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. కేవలం నటుడిగానే కాకుండా రైటర్, సింగర్, స్టంట్ డిజైనర్, డైరెక్టర్.. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. తన పేరు వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీని పవన్ బయటపెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

సంబంధిత వార్తలు

Pawan KalyanKalyan KumarAndhra Pradesh Deputy CMMartial ArtsPower StarTollywood

More Telugu News

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే

02 Nov, 15:19

విటమిన్ బీ12 ఎందుకంత కీలకం? లోపిస్తే ఏం జరుగుతుంది?

02 Nov, 15:18

నటనలో 'బాద్‌షా'.. వ్యాపారంలోనూ 'కింగ్'.. షారుఖ్ ఆస్తుల విలువ రూ. 10,000 కోట్లు!

02 Nov, 15:04

48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

02 Nov, 15:02

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్ షా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం

02 Nov, 15:00

ఈ అర్ధరాత్రి తీరం తాకనున్న 'మురసు' తుపాను.. ఒంగోలుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం

02 Nov, 14:57

మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు.. రేవంత్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం

02 Nov, 14:38

వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. 11న పార్టీని ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

02 Nov, 14:34

ఏపీలో పరిషత్ పోరు.. ఈ నెల 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

02 Nov, 14:28
..More Telugu News