Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాక్లెట్స్ తినాలనిపిస్తోందా? మీ శరీరం మీకు ఏం చెప్పాలనుకుంటుందో తెలుసా!

Chocolate cravings know what your body is trying to tell you
Advertisement
  • చాక్లెట్ క్రేవింగ్స్ వెనుక ఆరోగ్య సంకేతాలు
  • డార్క్ చాక్లెట్ కోరుకుంటే మెగ్నీషియం లోపం
  • బ్లడ్ షుగర్ తగ్గితే చాక్లెట్ తినాలనిపిస్తుంది
  • ఒత్తిడి పెరిగితే మెదడు చాక్లెట్ కోరుకుంటుంది
  • హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో క్రేవింగ్స్
  • పోషకాల లోపాన్ని గుర్తించడానికి ఇదో మార్గం
Advertisement
చాలామందికి ఒక్కోసారి చాక్లెట్ తినాలనే బలమైన కోరిక కలుగుతుంటుంది. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా మూడ్ బాగోలేనప్పుడు ఇది మరింత ఎక్కువవుతుంది. చాక్లెట్‌లో ఉండే షుగర్, ఫ్యాట్‌తో పాటు థియోబ్రోమిన్, ఫెనిథైలమిన్‌ వంటి పదార్థాలు మెదడులో సెరటోనిన్, డోపమైన్ అనే ఫీల్-గుడ్ హార్మోన్లను విడుదల చేస్తాయి. అయితే, ఇలా చాక్లెట్ తినాలనిపించడం కేవలం రుచి కోసం మాత్రమే కాదు. అది శారీరక, మానసిక ఆరోగ్య స్థితికి సంకేతం. మీ శరీరంలో కొన్ని పోషకాలు తగ్గినా లేదా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినా ఈ విధమైన సంకేతాలు వస్తుంటాయి.

ప్రధాన కారణాలు..

మెగ్నీషియం లోపం: చాక్లెట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు తరచూ డార్క్ చాక్లెట్ తినాలనిపిస్తే.. మీ శరీరంలో మెగ్నీషియం లోపించిందని అర్థం కావచ్చు. ఇది కండరాల విశ్రాంతికి, గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం: మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా చాక్లెట్ క్రేవింగ్స్ వస్తే.. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడం లేదా శరీరంలో తక్షణ శక్తి తగ్గడం దానికి కారణం కావచ్చు.

మానసిక ఒత్తిడి, ఆందోళన: తీవ్రమైన ఒత్తిడి, ఒంటరితనం లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు మెదడు తక్షణ కెమికల్ బూస్ట్ కోసం వెతుకుతుంది. చాక్లెట్ తినడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై మనసు కాస్త ప్రశాంతంగా మారుతుంది.

హార్మోన్ల మార్పులు: మహిళల్లో పీరియడ్స్ వచ్చే ముందు హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనివల్ల మెదడులో సెరటోనిన్ తగ్గిపోతుంది. ఆ శారీరక, మానసిక అసౌకర్యాన్ని అధిగమించడానికి శరీరం చాక్లెట్‌ను కోరుకుంటుంది.

డార్క్ వర్సెస్ మిల్క్ చాక్లెట్
మీకు డార్క్ చాక్లెట్ తినాలనిపిస్తే శరీరానికి మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అవసరమని అర్థం. దీనికోసం బాదం, గుమ్మడికాయ గింజలు, ఆకుకూరలు డైట్‌లో చేర్చుకోవచ్చు. అదే మిల్క్ లేదా వైట్ చాక్లెట్ తినాలనిపిస్తే.. శరీరానికి తక్షణ కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ లేదా మానసిక ప్రశాంతత అవసరమని అర్థం. ఇలాంటప్పుడు పండ్లపై నట్ బటర్ రాసుకుని తినడం లేదా గ్రీక్ యోగర్ట్ తీసుకోవడం మంచిది.
Advertisement
Advertisement
Chocolate
Magnesium deficiency
Food cravings
Hormonal imbalance
Health tips
Stress relief

More Telugu News