రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
- ఒక్క రోజు ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు
- రేపు అర్ధరాత్రికి మళ్లీ అమరావతికి చేరుకోనున్న సీఎం
- కేంద్ర పెద్దలను కలిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇది కేవలం ఒక్కరోజు పర్యటన మాత్రమే కావడం గమనార్హం. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి, అక్కడ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని అదే రోజు అర్ధరాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించే వీలుంది. అలాగే ఢిల్లీలోని జన్‌పథ్‌లో జరగనున్న ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ఎవరెవరితో సమావేశమవుతారనే వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.