బడ్జెట్‌ ధరలో 8,000mAh బ్యాటరీతో రియల్‌మీ ఫోన్‌

Technology
Advertisement
  • భారీ బ్యాటరీ ఉన్నా.. స్లిమ్‌గా ఉండే ఫోన్‌
  • రూ.18,999 నుంచి ధర ప్రారంభం
  • మొత్తం మూడు వేరియంట్లు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌
  • 50 మెగాపిక్సెల్ మెయిన్ ఏఐ కెమెరా
Advertisement
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, ముఖ్యంగా మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని బాధపడేవారికి రియల్‌మీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త సాంకేతికతతో, కళ్లు చెదిరే ఫీచర్లతో రియల్‌మీ పీ4ఆర్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీంట్లో హైలైట్ ఏంటంటే.. ఏకంగా 8,000mAh బ్యాటరీని అమర్చారు. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 8.8 mm మందంతో చాలా స్లిమ్‌గా ఉండటం విశేషం. యువతను, గేమర్లను టార్గెట్ చేస్తూ రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో ఈ మిడ్-రేంజ్ ఫోన్‌ను కంపెనీ డిజైన్ చేసింది.

ధర, వేరియంట్లు
ఈ ఫోన్ ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతోంది. మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ల్యావెండర్ గ్లేర్, సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్ రంగుల్లో లభిస్తుంది.

  • 4GB రామ్ + 128GB స్టోరేజ్: రూ.18,999
  • 6GB రామ్ + 128GB స్టోరేజ్: రూ.20,999
  • 6GB రామ్ + 256GB స్టోరేజ్: రూ.22,999

దీన్ని రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు.

3 రోజుల పాటు బ్యాటరీ
ఈ ఫోన్‌లోని 8,000mAh బ్యాటరీకి తోడుగా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణంగా వాడేవారికి ఏకంగా 3 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే నాన్‌స్టాప్‌గా 12.5 గంటల పాటు ఫ్రీ ఫైర్ గేమ్‌, 26.9 గంటల నావిగేషన్, 21.6 గంటల యూట్యూబ్ వీడియోలు, 6.5 రోజుల పాటు నిరంతరాయంగా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆనందించవచ్చు.

పవర్‌ఫుల్ ఫీచర్లు.. 
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను వాడారు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి 5,300 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం కలిగిన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 బేస్డ్ రియల్‌మీ UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో పాటు స్మూత్ గేమింగ్ కోసం 144Hz రీఫ్రెష్ రేట్ ఇవ్వడం విశేషం.

ఏఐ కెమెరా
ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ ఏఐ కెమెరాతో పాటు సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై నోటిఫికేషన్ల కోసం ప్రత్యేకంగా ‘ఏఐ పల్స్‌ లైట్‌’ అనే లైటింగ్‌ను ఇచ్చారు. దీన్ని యూజర్లు తమకు నచ్చినట్లు 9 రంగుల్లో, 5 రకాల స్పీడ్ సెట్టింగ్స్‌తో కస్టమైజ్ చేసుకోవచ్చు. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్, ఫోన్ కిందపడినా పగలకుండా ఉండేందుకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా దీని సొంతం.
Advertisement

సంబంధిత వార్తలు

Realme P4R 5GRealme 8000mAh battery smartphoneRealme P4R 5G India priceBest budget 5G phonesRealme P4R 5G specificationsMediaTek Dimensity 6300 phones

More Telugu News

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39

అసలు వీటిని ఎన్నికలంటారా?: రవీంద్రనాథ్ రెడ్డి

02 Nov, 16:35

దిగ్గజ జట్లకు షాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ సంచలనం

02 Nov, 16:17

రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్

02 Nov, 16:14

ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం: జగన్

02 Nov, 16:14

హైదరాబాద్‌లో పాదయాత్రకు ముందు కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆసక్తికర పోస్ట్‌!

02 Nov, 16:07

బెంగళూరు ఆసుపత్రికి జగన్.. రాప్తాడు బాధితురాలికి పరామర్శ

02 Nov, 15:59

పల్లీలు తింటే అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

02 Nov, 15:56

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21
..More Telugu News