ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న రాఘవ లారెన్స్ కూతురు

Lawrence daughter entry into Kollywood
  • కూతురు రాఘవిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న లారెన్స్
  • అమెరికాలో డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు చేసిన రాఘవి
  • సొంత డబ్బుతో సినిమా నిర్మిస్తున్న రాఘవ

కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా మల్టీ టాలెంట్ చాటుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం 'కాంచన-4', లోకేష్ కనగరాజ్ 'బెంజ్', ప్రతిష్ఠాత్మక 'కాలభైరవ' చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, లారెన్స్ కుటుంబం నుంచి మరో వ్యక్తి సినీ రంగప్రవేశం చేయబోతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లారెన్స్ కూతురు రాఘవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే, చాలా మంది స్టార్ల పిల్లల్లాగా హీరోయిన్‌గా కాకుండా.. లారెన్స్ కూతురు రాఘవి ఏకంగా దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం.


రాఘవికి చిన్నప్పటి నుండే సినిమా మేకింగ్ పట్ల ఆసక్తి ఉంది. దీంతో, ఆమె అమెరికా వెళ్లి డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసింది. సాధారణంగా ఎవరైనా దర్శకులు కావాలంటే పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి అనుభవం సంపాదిస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి ముందస్తు ఎక్స్‌పీరియన్స్ లేకుండా, నేరుగా మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమై భారీ రిస్క్ తీసుకోబోతోంది. కూతురి నిర్ణయానికి లారెన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఈ మొదటి సినిమాను తన సొంత డబ్బులతోనే నిర్మించడానికి కథను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్‌ను హీరోగా సపోర్ట్ చేస్తున్న లారెన్స్, ఇప్పుడు కూతురిని కూడా డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ తన ఫ్యామిలీ నుంచి కొత్త టాలెంట్‌ను పరిశ్రమకు అందిస్తున్నారు.

Go Back to Shorts
Lawrence
Daughter
tollywood
kollywood

More Telugu News