పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Both States
Advertisement
  • పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్
  • రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ సభ పెట్టడంపై ఆగ్రహం
  • ఆవిర్భావ దినోత్సవాన పవన్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
  • పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ పొన్నం తీవ్ర విమర్శలు
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ఇక్కడ సభలు నిర్వహించుకోవాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని మేం ఆపడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 'నవ నిర్మాణ సంకల్ప సభ' నిర్వహించాలని పవన్ కల్యాణ్ మొదట భావించారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేనాని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ పరిణామాలపై హుస్నాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారు. అలాంటి వ్యక్తి, తెలంగాణకు ఎంతో భావోద్వేగమైన ఆవిర్భావ దినోత్సవాన సభ ఎలా పెడతారు?" అని ప్రశ్నించారు. పవన్‌ను 'పెయిడ్ ఆర్టిస్ట్'గా అభివర్ణించిన పొన్నం, ఆయన పర్యటన వెనుక బీజేపీ వంటి ఇతర పార్టీల అజెండా ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు.

నాలుగు నెలల క్రితం పవన్ తెలంగాణకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి స్వాగతించిందని గుర్తుచేశారు. ఆయన రాష్ట్రానికి రావడాన్ని ఎవరూ అడ్డుకోరని, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌కు సంబంధించిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ పవన్ క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.

ఏపీ ప్రజలను తెలంగాణ స్వాగతిస్తుందని మంత్రి అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, తెలంగాణలో తిరగవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలకు ఏం పని అని తాము అనడం లేదని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినే చర్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి చిట్టీలు వస్తున్నాయా అని నిలదీశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ponnam Prabhakar fires at Pawan KalyanTelangana minister on Pawan KalyanPawan Kalyan Telangana tour

More Telugu News

మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు

27 Oct, 13:03

సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస

27 Oct, 12:58

గేమింగ్‌లో మొదలై ప్రపంచమంతా పాకిన పదం.. 2026 ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇదే..!

27 Oct, 12:57

కొత్త పెళ్లికూతురిగా విధులకు లోకో పైలట్.. వీడియో వైరల్!

27 Oct, 12:53

'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

27 Oct, 12:48

భారత్‌ నుంచి రూ.5,876 కోట్ల వస్తువులు.. నిషేధం ఉన్నా పాకిస్థాన్‌కు ఎలా చేరాయి?

27 Oct, 12:46

స్థానిక ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. రెబల్స్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ

27 Oct, 12:33

స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి

27 Oct, 12:25

చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు సీఎం విజయ్.. 2015 పునరావృతం కాకూడదని హెచ్చరిక!

27 Oct, 12:23

సిరీస్‌పై కన్నేసిన భారత్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అయ్యర్‌!

27 Oct, 12:19

పండగ పూట ర్యాలీ వద్దు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల వినతి.. రూ.10,000 కోట్ల నష్టం తప్పదని ఆవేద‌న‌!

27 Oct, 12:17

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు చూశారా? రాజసం ఉట్టిపడే డిజైన్‌ వైరల్‌!

27 Oct, 12:15

హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం.. సౌదీ అరేబియా రూ.9,500 కోట్ల‌ ఆఫర్?

27 Oct, 11:51

ఆర్నబ్ తుపాను: ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం.. రోడ్డుపైకి బండరాళ్లు

27 Oct, 11:48

సోషల్‌ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే!

27 Oct, 11:47
..More Telugu News