తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు

Both States
Advertisement
  • రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్న చంద్రబాబు
  • హైదరాబాద్, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని ఆకాంక్ష
  • రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపు
Advertisement

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలుగు వారు మరెన్నో విజయాలను సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని తన సందేశంలో పేర్కొన్నారు. 


ప్రతి తెలుగు కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకోవాలని, అత్యున్నత జీవన ప్రమాణాలను సాధించాలని ఆకాంక్షించారు. ‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధన కోసం రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

సంబంధిత వార్తలు

ChandrababuTDPTelangana Formation Day

More Telugu News

మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు

27 Oct, 13:03

సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస

27 Oct, 12:58

గేమింగ్‌లో మొదలై ప్రపంచమంతా పాకిన పదం.. 2026 ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇదే..!

27 Oct, 12:57

కొత్త పెళ్లికూతురిగా విధులకు లోకో పైలట్.. వీడియో వైరల్!

27 Oct, 12:53

'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

27 Oct, 12:48

భారత్‌ నుంచి రూ.5,876 కోట్ల వస్తువులు.. నిషేధం ఉన్నా పాకిస్థాన్‌కు ఎలా చేరాయి?

27 Oct, 12:46

స్థానిక ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. రెబల్స్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ

27 Oct, 12:33

స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి

27 Oct, 12:25

చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు సీఎం విజయ్.. 2015 పునరావృతం కాకూడదని హెచ్చరిక!

27 Oct, 12:23

సిరీస్‌పై కన్నేసిన భారత్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అయ్యర్‌!

27 Oct, 12:19

పండగ పూట ర్యాలీ వద్దు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల వినతి.. రూ.10,000 కోట్ల నష్టం తప్పదని ఆవేద‌న‌!

27 Oct, 12:17

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు చూశారా? రాజసం ఉట్టిపడే డిజైన్‌ వైరల్‌!

27 Oct, 12:15

హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం.. సౌదీ అరేబియా రూ.9,500 కోట్ల‌ ఆఫర్?

27 Oct, 11:51

ఆర్నబ్ తుపాను: ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం.. రోడ్డుపైకి బండరాళ్లు

27 Oct, 11:48

సోషల్‌ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే!

27 Oct, 11:47
..More Telugu News