ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది: ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

01-06-2026 Mon 09:14 | National
Advertisement
  • ఫైనల్‌లో జీటీని ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ
  • వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డ్
  • ఈ మ్యాచ్ వేదిక మార్చ‌డంపై రాజ‌కీయ వివాదం
  • రాజకీయ కారణాలతోనే ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించారన్న డీకే శివకుమార్
Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి, ఐపీఎల్‌లో తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, విరాట్ కోహ్లీ వీర విహారంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, మొత్తం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి వెంకటేశ్ అయ్యర్ (32) నుంచి మంచి సహకారం లభించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. 2025లో కూడా ఆర్సీబీ తమ తొలి టైటిల్‌ను అహ్మదాబాద్‌లోనే గెలుచుకోవడం విశేషం.

ఈ విజయంపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. రాజకీయ కారణాల వల్లే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. "నిజానికి ఆర్సీబీ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సింది. మా అభిమానుల‌కు అన్యాయం జరిగింది. రాజకీయాల కారణంగా వాళ్లు మ్యాచ్‌ను అక్కడికి తీసుకెళ్లారు. దీనిపై ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను" అని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆర్సీబీ ఆటగాళ్లకు, జట్టుకు కర్ణాటక ప్రజల తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

2022లో ఇదే స్టేడియంలో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆర్సీబీ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, అలాగే కేవలం ఆరు రోజుల్లో మూడు వేర్వేరు వేదికలలో మూడు మ్యాచ్‌లు ఆడటం వంటి కఠినమైన షెడ్యూల్ వారి ఓటమికి కారణాలుగా నిలిచాయి.
Advertisement
DK ShivakumarRCBRoyal Challengers BangaloreIPL FinalNarendra Modi StadiumVirat KohliGujarat TitansIPL 2024BengaluruKarnataka

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more