కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య

29-05-2026 Fri 12:22 | National
Advertisement
  • రాజీనామా అనంతరం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య
  • కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన సిద్ధూ
  • రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు అధిష్ఠానానికి థ్యాంక్స్ చెప్పిన సిద్ధరామయ్య
Advertisement
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటిరోజే, సిద్ధరామయ్య శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడబోయే మంత్రివర్గంలో తన కుమారుడికి కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించాలని కోరడంతో పాటు తన డిమాండ్ల జాబితాను పార్టీ అధిష్ఠానానికి సమర్పించారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం తన కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని పార్టీ పెద్దలకు చెప్పారు. అనంతరం ఆయన తన డిమాండ్ల జాబితాను వారికి ఇచ్చారు.

సిద్ధరామయ్య రాజ్యసభ, ఎమ్మెల్సీ నియామకాల కోసం కొన్ని పేర్లను అధిష్ఠానానికి సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో కేటాయించే పదవులపై కూడా తన ప్రాధాన్యతలను ఆయన జాబితాలో పొందుపరిచారు. వైద్య, విద్య, వెనుకబడిన తరగతుల శాఖలు లేదా ఇటీవలి వరకు శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు లేదా జలవనరుల శాఖ వంటి కీలక పోర్ట్‌పోలియోలను తన కుమారుడికి కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.
Advertisement
SiddaramaiahRahul GandhiMallikarjun KhargeKarnataka PoliticsDK ShivakumarYatindraAICC

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more