లోకేశ్ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పొలిటికల్ విజన్ తో ముందుకెళుతుంది: శ్రీభరత్
- విశాఖలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీభరత్
- దేశం మొత్తం పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం దక్కించుకుందని వెల్లడి
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్ర స్థాయిలో అద్భుతంగా పనిచేసిందని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక 'మహానాడు' వేడుకల సందర్భంగా విశాఖపట్నం టీడీపీ లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అత్యంత కీలకమైన గణాంకాలను వెల్లడించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ... దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం వాటాని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దక్కించుకుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిందని, పారదర్శకమైన విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు మొగ్గు చూపారని ఆయన స్పష్టం చేశారు.