ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్... ఎంపీల ఘనస్వాగతం

Nara Lokesh Reaches Delhi Received by MPs
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్
  • విమానాశ్రయంలో స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు
  • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణకు హాజరు
  • ప్రధాని మోదీపై అనుభవాలతో రాసిన పుస్తకం
  • రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న కార్యక్రమం
ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సోమవారం నాడు ఢిల్లీకి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు లోకేష్ ఢిల్లీకి వెళ్లారు.
మంగళవారం (మే 26) ఉదయం 11 గంటలకు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న అనుభవాలను వివరిస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ "అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ" అనే పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురు జాతీయ స్థాయి నేతలతో పాటు లోకేష్‌కు కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఖరారైంది.
Go Back to Shorts
Nara Lokesh
AP IT Minister
Delhi Visit
Shivraj Singh Chouhan
Apnapan Narendra Modi
Book Launch
Telugu Desam Party
TDP MPs
Narendra Modi
Central Minister

More Telugu News