ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా
- ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
- గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి
- హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ
- మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు
- మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టించనుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో ఏకంగా 1,875 క్లస్టర్లలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళామణులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ మహానాడు జరగనుందని పల్లా స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో భవిష్యత్ నాయకులను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికే ఈ క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే 1,875 క్లస్టర్లకు గానూ 1,851 క్లస్టర్లలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.
మహానాడు తొలిరోజు కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తొలుత ఎన్టీఆర్కు నివాళులు అర్పించి, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి సెషన్ గంటన్నర పాటు జరిగాక 15 నిమిషాల విరామం, మరో గంటన్నర రెండో సెషన్ తర్వాత భోజన విరామం ఉంటుందని చెప్పారు. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై 65 మంది వక్తలు ప్రసంగించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈసారి వినూత్నంగా మహానాడు: చింతకాయల విజయ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఈసారి 'హైబ్రిడ్ మహానాడు'ను విజయవంతం చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మహానాడు వినూత్నంగా జరగనుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 'మై టీడీపీ' యాప్ ద్వారా డిజిటల్ హాజరు తీసుకుంటామని, యువత భాగస్వామ్యం పెద్దఎత్తున ఉండేలా ప్రోత్సహిస్తామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీ శ్రేణుల మధ్య బంధం పెంచడమే ఈ మహానాడు లక్ష్యమని పేర్కొన్నారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో ఉన్నత స్థానం లభించేలా లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఈ మహానాడు ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని విజయ్ స్పష్టం చేశారు.