పోక్సో కేసులో దోషికి రెండు మరణశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు

  • తమిళనాడులో కీలక తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు
  • విద్యార్థినిపై అత్యాచారం, అతి దారుణంగా హత్య
  • అరుదైన కేసుగా పేర్కొన్న పోక్సో కోర్టు
తమిళనాడులో 12వ తరగతి విద్యార్థిని హత్యాచారం కేసులో దోషికి రెండు మరణశిక్షలను విధిస్తూ పోక్సో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. విలాతికుళం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినిపై ధర్మ మునీశ్వరన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అతి దారుణంగా ప్రవర్తించినందుకు గానూ ఈ శిక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. దీనిని అరుదైన కేసుగా పేర్కొన్న పోక్సో కోర్టు, గతంలోనూ పలు నేరాల్లో అతడికి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది.

విలాతికుళం సమీపంలోని వేదనాథం గ్రామానికి చెందిన పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని మార్చి 10వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు వేదనాథం అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో విగతజీవిగా కనిపించింది. తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు స్థానిక ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మార్చి 19న నిందితుడిని అరెస్టు చేశారు. అతడు గతంలోనూ ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినిపై హత్యాచారం జరిగిన సమయంలో అతడు బెయిల్‌పై బయట ఉన్నాడు

Dharma Muneeswaran
POCSO Act
Tamil Nadu
Vilathikulam
Vedanatham
minor rape case
double death sentence

More Telugu News