అది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. ఇవిగో 11 నిదర్శనాలు: వైసీపీపై చంద్రబాబు ఫైర్

  • చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని సభ
  • వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు
  • వివేకా హత్య నుంచి అభివృద్ధిపై వేటు వరకు ప్రస్తావన
  • సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అంటూ వ్యాఖ్య
  • గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అని పిలుపు
చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను 'గొడ్డలి పార్టీ' అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. 

ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదు... సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం... గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

1. వివేకా హత్య, నాటకాలు - అంతిమ లబ్దిదారు ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసు

2. కోడికత్తి డ్రామా... గులకరాయి డ్రామా... ప్రజలను మోసం చేసే ఎత్తుగడ.

3. దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, డోర్ డెలివరీ- నిందితుడికి వైసీపీ అండదండలు.

4. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ పై దాడి – వేధించి ప్రాణాలు తీసిన వైసీపీ ప్రభుత్వం.

5. కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు – ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం.

6. హిందూ దేవుళ్లపై అకృత్యాలు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు... తప్పుడు ప్రచారాలు.

7. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు.

8. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసేంత రక్త దాహంతో వైసీపీ.

9. గంజాయి బ్యాచ్ లకు ప్రోత్సాహం...రప్పా రప్పా రంకెలు...జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు.

10. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను తొక్కించారు...కడపలో పెద్ద దస్తగిరిని చంపేశారు.

11. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు... అంటూ చంద్రబాబు పాయింట్ల వారీగా వివరించారు. 

Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Viveka Murder
Kodikathi Drama
Dalit Driver Subramanyam
Polavaram Project
Amaravati
YS Jagan
TDP

More Telugu News