ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి

Heatwave Grips Andhra Pradesh and Telangana Temperatures Soar
  • పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిన్న 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
  • రోహిణి కార్తె కంటే ముందే మండుతున్న ఎండలు
  • తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమికి అనేక ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా నిన్న 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న పల్నాడు జిల్లాలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పిడుగురాళ్ల వంటి చోట ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదయింది. బాపట్ల జిల్లా వేటపాలెం, ప్రకాశం జిల్లా అద్దంకి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా, 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో రోహిణికార్తె కంటే ముందే ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్, హన్మకొండ, రామగుండం, భద్రాచం తదితర ప్రాంతాల్లో 44 డిగ్రీలస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. హైదరాబాద్ నగర ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్ నగరంలో 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది.
Go Back to Shorts
Heatwave
Andhra Pradesh
Telangana
Hyderabad
Heat stroke
Weather forecast
Temperature

More Telugu News