‘ధురంధర్’తో దేశ రహస్యాలు లీక్? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
- ‘ధురంధర్-2’ సినిమాపై కోర్ట్‌కు ఎస్ఎస్‌బీ హెడ్ కాన్స్టేబుల్
- ఈ చిత్రం దేశ భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపణ
- ఆర్మీ రహస్య ఆపరేషన్ల వివరాలను చూపించారని ఆందోళన
- భద్రతా దళాల ఆందోళనను తోసిపుచ్చలేమన్న కోర్టు
- తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచన
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ధురంధర్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో భారత సాయుధ దళాల రహస్య ఆపరేషన్ వివరాలను బహిర్గతం చేశారంటూ దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పందించింది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి, సెన్సార్ బోర్డ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఎస్‌ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ పిటిషన్
సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. ‘ధురంధర్-2’ సినిమాలో ఆర్మీ ఆపరేషన్లకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను చూపించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టు సీరియస్
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘సినిమా కేవలం వినోదం కోసం తీసిన కల్పిత కథ కావచ్చు. కానీ ఒక దేశ భద్రతా ఉద్యోగి వ్యక్తం చేసిన ఆందోళనలను మనం అంత తేలిగ్గా తీసిపారేయలేం. సమాజంపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
చట్టాల ఉల్లంఘన
ఈ సినిమాలో కొన్ని రహస్య ప్రాంతాల గుర్తింపులు, ఉన్నతాధికారులు, అమరవీరుల పాత్రలను మరీ బాహాటంగా చూపించారని పిటిషనర్ వాదించారు. ఇది ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ నిబంధనలను ఉల్లంఘించడమేనని కోర్టుకు తెలిపారు. దీనివల్ల దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
కేంద్రానికి డెడ్‌లైన్
ఈ పిటిషన్‌ను పూర్తిగా పరిశీలించి, దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సెన్సార్ బోర్డ్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.