పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. త్వరలో వాట్సాప్ సేవలు

Business
Advertisement
  • వాట్సాప్ ద్వారా ఎంతోమందికి చేరువ కావొచ్చన్న కేంద్రమంత్రి
  • పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు
  • త్వరలో యూపీఐ ద్వారా ఉపసంహరణకు అవకాశం
Advertisement
ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త. ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సేవల కోసం త్వరలో వాట్సాప్ సేవలను ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తేనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారని, ఈ నేపథ్యంలో దీని ద్వారా ఎంతోమందికి చేరువ కావడం సులువవుతుందని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈపీఎఫ్ఓ చందదారుల వెసులుబాటు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోచ్చు. గ్రీన్ టిక్ మార్కు కలిగిన ఈపీఎఫ్ఓ వాట్సాప్ నెంబర్‌కు 'హలో' అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. యూఏఎన్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా ఈ సేవలు లభిస్తాయి. ఈపీఎఫ్ఓకు సంబంధించిన సందేశాలు కూడా స్థానిక భాషల్లో ఎప్పటికప్పుడు అందుకోవచ్చు.

ఆటోమేటెడ్ సిస్టం ద్వారా వాట్సాప్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నెల రోజుల్లోపు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరోవైపు, యూపీఐ ద్వారా పీఎఫ్ నిల్వలను ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి తెలిపారు. లావాదేవీలు నిర్వహించేందుకు యూపీఐ పిన్ అవసరమవుతుందని అన్నారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే 7 కోట్లమంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

EPFOProvident FundWhatsApp servicesEmployees Provident Fund OrganisationMansukh MandaviyaPF balanceUANUPIPF withdrawal

More Telugu News

విజయవాడ మేయర్ పోరులో వంగవీటి రాధా ఆధిక్యం.. రెండో స్థానంలో ఏబీ వెంకటేశ్వరావు

03 Nov, 11:39

బద్వేలు మున్సిపాలిటీ కూటమి కైవసం.. క్లీన్‌స్వీప్‌తో సంపూర్ణ విజయం

03 Nov, 11:34

ఏపీ కార్పొరేషన్ ఫలితాలు.. టీడీపీ, జనసేన హవా

03 Nov, 10:56

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ ప్రభుత్వ జాబితాలో చేర్చడంపై చర్చ

03 Nov, 10:54

ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న హెలికాప్టర్లు.. వీడియో ఇదిగో!

03 Nov, 10:51

ఇతరులకు ఇబ్బంది కాకూడదు.. సూపర్‌ మార్కెట్‌లో ఇలా ప్రవర్తించకండి!

03 Nov, 10:49

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంబటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

03 Nov, 10:47

భూమిపైకి జీవం అంతరిక్షం నుంచి రాలేదా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

03 Nov, 10:45

‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. సాయి దుర్గా తేజ్ పెళ్లి ఫిక్స్?.. డిసెంబర్‌లో వివాహ ముహూర్తం?

03 Nov, 10:41

పులివెందులలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను తరిమికొట్టారు: సతీశ్ కుమార్ రెడ్డి

03 Nov, 10:38

ఫ్లోరిడా విమాన ప్రమాదం: చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన, ప్రియుడికి కో-పైలట్ మెసేజ్!

03 Nov, 10:36

ఇక భువనేశ్వర్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

03 Nov, 10:29

భారత్-పాక్ మ్యాచ్: 34 వేల సీట్లకు 84 లక్షల దరఖాస్తులు.. ఇదే అసలైన క్రేజ్!

03 Nov, 10:27

చలి వాతావరణంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ చిట్కాలు పాటించండి!

03 Nov, 10:15

జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు

03 Nov, 10:09
..More Telugu News