మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన

National
Advertisement
  • ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఘటన
  • తన వార్డులో అభివృద్ధి పనుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ
  • అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వినూత్న నిరసన
Advertisement
తన వార్డులో అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఉషా దేవి శంఖ్వార్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు చేయించుకుని నిరసన తెలిపారు. తన వార్డులో పౌర సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని, అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కొద్ది రోజులుగా ఆమె మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలుపుతున్నారు.

అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ అడ్డుకుంటున్నారని, దీని వల్ల గత మూడేళ్లుగా ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఉషాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. ఆమె వార్డుకు సుమారు రూ.64 లక్షల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. కొన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తవుతాయని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Usha Devi ShankhwarFirozabad Municipal CorporationUttar PradeshBJP CouncillorMunicipal Commissioner

More Telugu News

విజయవాడ మేయర్ పోరులో వంగవీటి రాధా ఆధిక్యం.. రెండో స్థానంలో ఏబీ వెంకటేశ్వరావు

03 Nov, 11:39

బద్వేలు మున్సిపాలిటీ కూటమి కైవసం.. క్లీన్‌స్వీప్‌తో సంపూర్ణ విజయం

03 Nov, 11:34

ఏపీ కార్పొరేషన్ ఫలితాలు.. టీడీపీ, జనసేన హవా

03 Nov, 10:56

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ ప్రభుత్వ జాబితాలో చేర్చడంపై చర్చ

03 Nov, 10:54

ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న హెలికాప్టర్లు.. వీడియో ఇదిగో!

03 Nov, 10:51

ఇతరులకు ఇబ్బంది కాకూడదు.. సూపర్‌ మార్కెట్‌లో ఇలా ప్రవర్తించకండి!

03 Nov, 10:49

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంబటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

03 Nov, 10:47

భూమిపైకి జీవం అంతరిక్షం నుంచి రాలేదా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

03 Nov, 10:45

‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. సాయి దుర్గా తేజ్ పెళ్లి ఫిక్స్?.. డిసెంబర్‌లో వివాహ ముహూర్తం?

03 Nov, 10:41

పులివెందులలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను తరిమికొట్టారు: సతీశ్ కుమార్ రెడ్డి

03 Nov, 10:38

ఫ్లోరిడా విమాన ప్రమాదం: చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన, ప్రియుడికి కో-పైలట్ మెసేజ్!

03 Nov, 10:36

ఇక భువనేశ్వర్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

03 Nov, 10:29

భారత్-పాక్ మ్యాచ్: 34 వేల సీట్లకు 84 లక్షల దరఖాస్తులు.. ఇదే అసలైన క్రేజ్!

03 Nov, 10:27

చలి వాతావరణంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ చిట్కాలు పాటించండి!

03 Nov, 10:15

జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు

03 Nov, 10:09
..More Telugu News