నా కళ్లెదుటే 20 మంది విద్యార్థుల వీసాలు తిరస్కరించారు: ఓ విద్యార్థి ఉత్కంఠభరిత అనుభవం
- ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో పొందిన అనుభవాన్ని పంచుకున్న హరికృష్ణ
- కొన్ని సెకన్ల సమయం కూడా ఇవ్వకుండా 20 మంది వీసాలను వరుసగా రిజెక్ట్ చేశారని వెల్లడి
- కారణం కూడా చెప్పకుండా రిజెక్షన్ లెటర్ చేతిలో పెట్టారన్న హరికృష్ణ
అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే ప్రతీ భారతీయ విద్యార్థి లైఫ్‌లో అత్యంత టెన్షన్ పుట్టించే ఘట్టం.. F-1 వీసా ఇంటర్వ్యూ. ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో తాజాగా వీసా పొందిన అహ్మదాబాద్‌కు చెందిన హరికృష్ణ త్రివేది అనే విద్యార్థి పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో, స్టూడెంట్ సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NJIT) లో మాస్టర్స్ కోసం వెళుతున్న త్రివేది, తాను వీసా సాధించిన తీరును, అక్కడ కళ్లారా చూసిన టెన్షన్ వాతావరణాన్ని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివరించాడు.
త్రివేది ముంబై కాన్సులేట్‌కు వెళ్ళినప్పుడు, అతని కంటే ముందు క్యూలో ఉన్న 20 మంది విద్యార్థుల అప్లికేషన్లు వరుసగా రిజెక్ట్ అయ్యాయి. వీసా ఆఫీసర్లు అభ్యర్థులకు కనీసం కొన్ని సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని, విద్యార్థులు తమ ఇంట్రడక్షన్ మొదలుపెట్టే లోపే మధ్యలో ఆపి.. ఎటువంటి నిర్దిష్ట కారణం చెప్పకుండా రిజెక్షన్ లెటర్ చేతిలో పెట్టారని త్రివేది చెప్పాడు. "వాళ్లు విండో దగ్గరకు రాకముందే వీసా ఆఫీసర్లు అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు అనిపించింది. కేవలం ఆరు ముక్కలు మాట్లాడే లోపే రిజెక్ట్ అవ్వడం చూసి నాది కూడా పోయినట్టే అని మానసికంగా ఫిక్స్ అయిపోయాను" అని త్రివేది ఆ టెన్షన్ క్షణాలను గుర్తుచేసుకున్నాడు.