భారత వాయుసేన కోసం మహీంద్రా స్కార్పియో వాహనాలు.. అదిరిపోయే ఫీచర్స్

Mahindra Scorpio cars for Indian Air Force with amazing features
  • స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఎస్‌యూవీల బ్యాచ్‌ను చేర్చుకున్న ఎయిర్ ఫోర్స్
  • ఒక్కో వాహనం ధర రూ. 16.99 లక్షలు
  • ఎయిర్ ఫోర్స్ బ్లూ కలర్ లో ఆకర్షణీయంగా ఉన్న వాహనాలు

భారత వైమానిక దళం తమ అధికారిక వాహన శ్రేణిలోకి సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఎస్‌యూవీల బ్యాచ్‌ను చేర్చుకుంది. దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై ఒకేసారి ఐదారు వాహనాలు కలిసి వెళుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో, ఆటోమొబైల్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.


సాధారణంగా భారత రక్షణ రంగానికి, పోలీస్ శాఖలకు స్కార్పియో అత్యంత నమ్మకమైన వాహనం. అయితే, తాజాగా ఐఏఎఫ్ దళంలో చేరిన ఈ స్కార్పియో క్లాసిక్ మోడల్స్ చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం... ఈ కార్లకు వేసిన 'ఎయిర్ ఫోర్స్ బ్లూ' కలర్. ఈ కలర్ షేడ్‌ను మహీంద్రా సంస్థ సాధారణ పౌరులు కొనుగోలు చేసే సివిలియన్ వర్షన్‌లో ఆఫర్ చేయడం లేదు, కేవలం వైమానిక దళం కోసమే ప్రత్యేకంగా దీనిని డిజైన్ చేశారు.

ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్స్:

పవర్‌ఫుల్ ఇంజన్: ఈ స్కార్పియో క్లాసిక్ ఎస్11 మోడల్‌లో 2.2-లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 130 bhp పవర్‌ను, 300 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది.

స్టాండర్డ్ ఇంటీరియర్స్: ఇవి స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ (RWD) మోడల్స్ లాగా కనిపిస్తున్నాయి. కారు ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, సాధారణ సివిలియన్ మోడల్‌లో ఉండే ఫీచర్లనే ఐఏఎఫ్ కార్లలోనూ కొనసాగించారు.

కఠినమైన రోడ్లకు పర్‌ఫెక్ట్: స్కార్పియోకు ఉన్న లాడర్-ఫ్రేమ్ కన్స్ట్రక్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్ పనితీరు రక్షణ రంగానికి ఎంతో నమ్మకమైన ఆప్షన్‌గా మార్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ వేరియంట్ ధర సుమారు రూ. 16.99 లక్షలుగా ఉంది.

Go Back to Shorts
Mahindra Scorpio
Indian Air Force
Scorpio Classic S11
IAF vehicles
Air Force Blue
SUV
defense vehicles
military vehicles
diesel engine
Mahindra

More Telugu News