తైవాన్‌లో భారతీయులకు వ్యతిరేకంగా బిల్ బోర్డు.. స్థానికుల నుంచే తీవ్ర విమర్శలు
- తైవాన్ ఎన్నికల అభ్యర్థి భారతీయులకు వ్యతిరేకంగా ప్రచారం
- తిరగేసిన భారత జెండా, తలపాగా ఉన్న బొమ్మపై ‘నో’ గుర్తు
- భారత్ నుంచి వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తూ బోర్డు
- బహిరంగంగా రేసిజం ప్రదర్శించడంపై నిరసనలు
తైవాన్‌లో స్థానిక ఎన్నికల బరిలో ఉన్న ఓ అభ్యర్థి.. భారతీయులను కించపర్చేలా, జాత్యహంకారాన్ని ప్రేరేపించేలా పొలిటికల్ బిల్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తైవాన్‌లోని కాహ్సియుంగ్ నగరంలో వెలిసిన ఈ బోర్డుపై భారతీయులతో పాటు అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
‘తైవాన్ పీపుల్స్ పార్టీ’కి చెందిన లీ హంగ్-యీ అనే స్థానిక వార్డు చీఫ్.. రాబోయే సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన తన ప్రచారంలో భాగంగా నగరంలోని షాన్మింగ్ రోడ్డుపై ఈ వివాదాస్పద బిల్ బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డుపై భారత జాతీయ జెండాను తిరగేసి, దానితో పాటు తలపాగా ధరించిన ఒక భారతీయుడి బొమ్మపై ‘రెడ్ క్రాస్’ను ముద్రించారు. భారతదేశం నుంచి వలస కార్మికులను తైవాన్‌కు రప్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ బోర్డును పెట్టారు.
తైవాన్, భారత్ మధ్య గతేడాది కుదిరిన కార్మిక ఒప్పందం ప్రకారం.. తైవాన్‌లో ఉన్న లేబర్ కొరతను తీర్చడానికి ఈ ఏడాది మొదటి విడతగా దాదాపు 1,000 మంది భారతీయ కార్మికులను తయారీ, వ్యవసాయ రంగాల్లోకి తీసుకోనున్నారు. అయితే దీన్ని కొందరు ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ భారతీయులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థి లీ హంగ్-యీ బహిరంగంగానే జాత్యహంకారాన్ని ప్రదర్శిస్తూ బోర్డు పెట్టారు. దీనిపై తైవాన్‌లోని భారత సంతతి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు ఈ చర్యను ‘అజ్ఞానపు ప్రదర్శన’గా అభివర్ణిస్తూ సదరు అభ్యర్థిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.