కదులుతున్న కారులో మహిళా లాయర్ పై సామూహిక అత్యాచారం

  • బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న బాధితురాలు
  • పుణే హోటల్ లో ఇద్దరు వ్యక్తులు పరిచయం
  • అందరూ పబ్ కు వెళుతుండగా కారులో అత్యాచారం

దేశంలో మహిళల రక్షణను, ముఖ్యంగా చట్టాన్ని రక్షించే వృత్తిలో ఉన్న వారి భద్రతను సైతం ప్రశ్నించేలా మహారాష్ట్రలోని పుణే నగరంలో అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన ఒక మహిళా లాయర్‌పై... కదులుతున్న కారులోనే పైశాచికంగా సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘోరానికి సంబంధించి పుణే పోలీసులు వేగంగా స్పందించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బీహార్‌లోని పాట్నాకు చెందిన సదరు బాధిత మహిళ పుణేలోనే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, ప్రస్తుతం బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిపరమైన పని నిమిత్తం పుణేకు వచ్చిన ఆమె.. గత ఆదివారం ఒక ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కోరేగావ్ పార్క్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు రమ్మని కోరారు. సదరు వ్యక్తి తనతో పాటు మరో ఇద్దరు మహిళలను తీసుకుని రాగా, అంతా కలిసి కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.


ఆ తర్వాత అదే హోటల్‌లో ఆదివారం రాత్రి మద్యం సేవించే క్రమంలో, పక్క టేబుల్‌పై ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో ఆమెకు మాటలు కలిసి పరిచయం ఏర్పడింది. అనంతరం వారంతా కలిసి ఒక పబ్ కు వెళ్లాలని నిర్ణయించుకుని కారులో బయలుదేరారు. అయితే, కారు ప్రయాణంలో ఉండగానే నిందితుల్లో ఒకడు ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా, నిందితులు తమ క్రూరత్వాన్ని పరాకాష్ఠకు తీసుకెళుతూ.. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే తమ మరో ఇద్దరు స్నేహితులకు ఫోన్‌ కాల్ చేసి, బాధిత మహిళపై అత్యంత అసభ్యకరమైన కామెంట్లు చేశారు.


ఈ ఘోరం జరిగిన తర్వాత బాధిత మహిళ ఎలాగోలా ఒక స్థానికుడి సహాయంతో తన స్నేహితుడిని సంప్రదించి, వెంటనే కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘాతుకంపై పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. "ఈ కేసును అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం, పరారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం" అని కమిషనర్ స్పష్టం చేశారు.




Pune Gang Rape Case
Pune
Gang Rape
Maharashtra
Lawyer
Bombay High Court
Koregaon Park
Crime
Amitesh Kumar
Matrimonial Site

More Telugu News