రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ

Lok Bhavan Rules Violated at Kerala CM Swearing in Ceremony
  • సీఎం, గవర్నర్‌ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్‌ నిబంధనలు
  • నిబంధనలు పక్కనబెట్టిన నేతలు
  • సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక
  • పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు
  • నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి
కేరళ ముఖ్యమంత్రి సతీశన్‌ ప్రమాణ స్వీకారంలో లోక్ భవన్ విధించిన నిబంధనల్ని పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వేదికపై కేవలం గవర్నర్, కొత్త సీఎం వీడీ సతీశన్, ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు మాత్రమే కూర్చోవాలని లోక్ భవన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని సమాచారం. మిగిలిన నేతలంతా కింద ప్రేక్షకుల్లోనే కూర్చోవాలని పేర్కొన్నట్లు లోక్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. కానీ ఈ ప్రొటోకాల్‌ను ఎవరూ పాటించలేదు.

సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత పినరయి విజయన్, సీపీఐ బినోయ్ విశ్వం, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్‌కు కూడా స్టేజ్‌పైనే సీట్లు కేటాయించారు. దీంతో లోక్ భవన్ ఆదేశాలు పూర్తిగా పక్కనబెట్టినట్లయింది.

ఈ కఠినమైన ప్రొటోకాల్స్ వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపించింది. రాహుల్ గాంధీ, ఖర్గేలను స్టేజ్‌పైకి రానివ్వకుండా చేయడానికే ఈ నిబంధనలు పెట్టారని మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని, హోంమంత్రులు ఇలాగే వేదికలను పంచుకుంటారని కాంగ్రెస్ గుర్తుచేసింది. లోక్ భవన్ వైఖరి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని విమర్శించింది.
Go Back to Shorts
Rahul Gandhi
Priyanka Gandhi
Kerala CM Swearing-in
VD Satheesan
Mallikarjun Kharge
Lok Bhavan
Kerala Politics
Protocol Violation
Political Controversy
Central Stadium

More Telugu News