'ఐక్య' సంస్థ ప్రారంభం వెనుక ఉద్దేశం ఇదే: మంచు మనోజ్, మౌనిక
- 'ఐక్య ధైర్య సేన సమితి'ని ప్రారంభించిన మంచు మనోజ్, మౌనిక
- సేవా భావం ఉన్నవారందరినీ ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యమన్న మనోజ్
- మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారిస్తామన్న మౌనిక
- ఐదుగురు పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ దంపతులు
- కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
సమాజానికి సేవ చేయాలనే బలమైన ఆలోచన ఉన్న ప్రతీ ఒక్కరినీ ఒకే గొడుగు కిందకు తేవాలనే గొప్ప లక్ష్యంతోనే ఐక్య సంస్థను ప్రారంభించినట్టు నటుడు 'రా కింగ్' మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా వెల్లడించారు. తన పుట్టినరోజు నేపథ్యంలో, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో "ఐక్య ధైర్య సేన సమితి" అనే తమ సామాజిక సేవా సంస్థను మనోజ్ అధికారికంగా ఆవిష్కరించారు. సేవా భావం ఉన్నవారందరికీ ఒక వేదికను అందించాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం గురించి మనోజ్ భావోద్వేగంగా మాట్లాడుతూ, "సమాజానికి అండగా నిలబడటం నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా, ఒకే ఆలోచన ఉన్న వారందరి కోసం ఒక వేదిక ఉండాలనిపించింది. ఈ ఆలోచన నిజానికి నా భార్య మౌనికది. ఆమె స్ఫూర్తితోనే ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా ఎవరికి నిజమైన సహాయం అందినా అదే మాకు గొప్ప విజయం" అని తెలిపారు. ఈ రోజు నుంచే ఐదుగురు పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరిస్తున్నామని, ఈ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ గ్రామానికి విస్తరిస్తామని ఆయన ప్రకటించారు.
అనంతరం మౌనిక భూమా మంచు మాట్లాడుతూ, "మంచి ఉద్దేశంతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్లే సాధ్యమైంది. ఈ ట్రస్ట్ ద్వారా రక్తదానంతో పాటు మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతాం. 'నమస్తే వరల్డ్' సంస్థ ద్వారా టాయ్ మేకింగ్ వంటి కోర్సులతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం" అని వివరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, "ఐక్య ధైర్య సేన సమితి" పేరును అధికారికంగా ప్రకటించారు. మనోజ్ కుటుంబంతో తమకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని, చిన్నప్పటి నుంచే మనోజ్‌లో సేవా భావం ఉందని కొనియాడారు. మౌనిక ఆలోచనతో పుట్టినరోజున ఈ ట్రస్ట్ ప్రారంభించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఒకవైపు ‘డేవిడ్ రెడ్డి’ వంటి భారీ చిత్రాలతో నటుడిగా బిజీగా ఉంటూనే, మరోవైపు 'ఐక్య ధైర్య సేన సమితి' ద్వారా సమాజ సేవకు అంకితం కావడం పట్ల మనోజ్ దంపతులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలు, సమాజ సేవ అనే రెండు మార్గాల్లో మనోజ్ తన ప్రయాణాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు.