పవన్ కల్యాణ్‌ను కలిసి ఆనందంతో పొంగిపోయిన టాలీవుడ్ నటుడు... ఫొటోలు ఇవిగో!

  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన నటుడు తనీష్
  • మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన భేటీ
  • భేటీ అనంతరం సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
  • పవన్‌తో పాటు రామ్ తల్లూరికి కృతజ్ఞతలు తెలిపిన తనీష్
  • తెలంగాణ జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న తనీష్
టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనీష్, 'జనసేన సాధక్' సమావేశంలో పాల్గొనేందుకు మంగళగిరి వచ్చినట్లు సమాచారం.

గత కొంతకాలంగా తెలంగాణ జనసేన విభాగంలో తనీష్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భేటీ అనంతరం తనీష్ తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. పవన్‌ను కలవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, "ఏం కావాలి ఇంతకన్నా, చాలు ఈ జన్మకి. కట్టే కాలేంత వరకు మీతోనే కల్యాణ్ సర్" అని పేర్కొన్నారు.

సినిమా పరిశ్రమలో 27 ఏళ్లుగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా కలవడం ఇదే మొదటిసారని తనీష్ తన పోస్టులో పేర్కొన్నారు. "ఆయన్ను చూడగానే కొన్ని క్షణాలు మాటలు రాలేదు. ఈ భేటీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'మనం కలిసి పనిచేద్దాం' అని పవన్ గారు నాతో అన్న ఒక్క మాట చాలు" అని తనీష్ తన ఆనందాన్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్ నిజాయితీ, సిద్ధాంతాలకు ఆకర్షితుడనై గత ఏడాది నుంచి తెలంగాణలో జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా తనకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నిర్మాత రామ్ తాళ్లూరికి కూడా తనీష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం జనసేన తరఫున నిరంతరం పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌తో దిగిన ఫొటోలను కూడా తనీష్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan
Tanish Alladi
Janasena
Andhra Pradesh
Telangana
Ram Talluri
Mandalagiri
Janasena Party Office

More Telugu News