ఇంధన పొదుపు: ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్‌ నిర్వహిస్తారా? కేంద్రానికి సీటీఐ ప్రతిపాదనలు

  • ఇంధన ఆదా కోసం తప్పదన్న సీటీఐ
  • కేంద్ర క్రీడాశాఖకు లేఖ
  • ఆటగాళ్ల ప్రయాణం కోసం భారీ ఇంధనం
  • ప్రేక్షకుల వాహనాలకూ పెట్రోల్‌ ఖర్చు
  • అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌ను పునర్వ్యవస్థీకరించాలని ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరింది. ఇంధన ఆదా కోసం మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకుల్లేకుండా కొన్ని పరిమిత వేదికల్లోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల దేశీయంగా లీటరు ఇంధనంపై 3 రూపాయల మేర పెరిగిన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ వల్ల పర్యావరణం, ఇంధన నిల్వలపై ప్రభావం పడుతోందని సీటీఐ తన లేఖలో ప్రస్తావించింది.

ఐపీఎల్ జట్లు నిరంతరం ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించడం వల్ల ఇంధన నిల్వలు భారీగా ఖర్చవుతున్నాయని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉపయోగించే బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320 చార్టర్డ్ విమానాలు గంటకు 2,400 నుంచి 3,000 లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను వినియోగిస్తాయని గుర్తుచేసింది.

ఒక్కో జట్టు ఈ సీజన్‌లో దాదాపు 10 విమాన ప్రయాణాలు చేస్తుందని, దీనివల్ల ఒక్కో ఫ్రాంచైజీ 50 వేల నుంచి 70 వేల లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తోందని బ్రిజేష్ గోయల్ లెక్కలతో వివరించారు. పైగా ఒక్కో మ్యాచ్‌ను చూడటానికి దాదాపు 50 వేల మంది వరకు ప్రేక్షకులు స్టేడియాలకు వస్తుంటారని గుర్తు చేశారు. వీళ్లు వాడే వాహనాల వల్ల రోజూ వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ వృథా అవుతోందని తెలిపారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో బయో-బబుల్ విధానంలో పరిమిత వేదికల్లో ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని సీటీఐ గుర్తు చేసింది.

IPL 2026
Brijesh Goyal
Chamber of Trade and Industry
CTI
Mansukh Mandaviya
Fuel Conservation
Energy Saving
Cricket
Indian Premier League
Aviation Turbine Fuel

More Telugu News