బ్రేకింగ్‌.. తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. టాప్‌ ర్యాంకర్లు వీళ్లే

TS EAPCET Results Released in Telangana
  • ఫలితాలు విడుదల చేసిన కేశవరావు
  • eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో ర్యాంకులు
  • పరీక్షలు పూర్తయిన ఆరో రోజే ఫలితాలు
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో తమ ర్యాంకులను తెలుసుకోవచ్చు.

పరీక్షలు పూర్తయిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్‌ స్క్రీన్‌పైనే మార్కులు కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 

ఎం. రుషి (ఉప్పల్‌) ఫస్ట్‌ ర్యాంక్‌ (156.64/160) సాధించగా.. అన్షుల్‌ (మూసాపేట) రెండో ర్యాంక్‌ (148.70), ఎం. వంశీధర్‌రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్‌ (147.05), జె. రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు) నాలుగో ర్యాంక్‌ (144.44), ఎ. సాయినిఖిత్‌ (మహబూబ్‌నగర్‌) ఐదో ర్యాంక్‌ (143.30) సాధించారు.
Go Back to Shorts
TS EAPCET
Telangana EAPCET Results
EAPCET Results
K Kesava Rao
V Balakista Reddy
JNTU Hyderabad
Telangana Education
Engineering Admissions
Agriculture Admissions
Pharmacy Admissions

More Telugu News