విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు
- కమల్ సీఎం అయితే అసూయపడతా
- స్టాలిన్ నాకు మంచి మిత్రుడు
- పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాణ్ని
- రాజకీయాలతో సంబంధం లేదు
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ గెలిచారని స్టార్ హీరో రజినీకాంత్ అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వివరణ ఇచ్చారు.
మరోవైపు విజయ్ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లేదన్నారు. తమ వయసులో 25 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతాను గానీ, విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు.