నడిరోడ్డుపై పావలా శ్యామల.. అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు
- అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సీనియర్ నటి పావలా శ్యామల
- డబ్బుల్లేవని ఆసుపత్రి నిరాకరణ, నడిరోడ్డుపై వదిలేసిన క్యాబ్ డ్రైవర్
- విషయం తెలిసి వెంటనే స్పందించిన నిర్మాత దిల్ రాజు
- శ్యామల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటన
- దిల్ రాజుకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల
తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ నడిరోడ్డుపై నిస్సహాయ స్థితిలో కనిపించిన సీనియర్ నటి పావలా శ్యామలను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చారు. ఆమె దయనీయ పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన తక్షణమే స్పందించి ఆమె పూర్తి వైద్య బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
ఒకప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల ప్రస్తుతం వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రాత్రి చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డబ్బు లేదనే కారణంతో యాజమాన్యం చేర్చుకోవడానికి నిరాకరించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్యామల, ఆమె కుమార్తెను క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆర్కే ఫౌండేషన్ సహాయంతో ఆమెను ఆదుకున్నారు.
పావలా శ్యామల దీనస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం దిల్ రాజు దృష్టికి వెళ్లింది. వెంటనే చలించిపోయిన ఆయన, తన బృందాన్ని అప్రమత్తం చేశారు. పావలా శ్యామల ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని, స్వయంగా ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల వివరాల ప్రకారం పావలా శ్యామల పిత్తాశయం (గాల్‌బ్లాడర్) సమస్యతో పాటు, అధిక క్రియాటినిన్ స్థాయులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. "శ్యామలకు అత్యుత్తమ వైద్యం అందించండి. ఖర్చుల గురించి ఆందోళన అవసరం లేదు. పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నా మేనేజర్లు మీతో టచ్‌లో ఉంటారు" అని దిల్ రాజు వైద్యులకు భరోసా ఇచ్చారు.
దిల్ రాజు బృందం ఆసుపత్రికి వెళ్లి శ్యామలను పరామర్శించగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన దిల్ రాజుకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. "దిల్ రాజు మాకు దేవుడితో సమానం. ఆయన కచ్చితంగా సహాయం చేస్తారని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. ఆ నమ్మకమే నిజమైంది" అని పావలా శ్యామల కుమార్తె అన్నారు. కష్టకాలంలో ఉన్న ఒక సీనియర్ కళాకారిణిని ఆదుకోవడానికి దిల్ రాజు చూపిన చొరవ పట్ల సినీ వర్గాలు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.