తెలంగాణ హైకోర్టు సీజే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన రేవంత్ రెడ్డి
- ఢిల్లీలో తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ వేడుక
- రిసెప్షన్‌కు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో పర్యటించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సాయంత్రం జరిగిన రిసెప్షన్‌లో పాల్గొన్నారు.