రాయల్ ఎన్ ఫీల్డ్ బండెక్కిన చంద్రబాబు... వీడియో ఇదిగో!
- శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు
- 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్‌కు ప్రశంసలు
- హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న చంద్రబాబు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో భాగంగా ఆయన హెల్మెట్ ధరించి, రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్‌పై ఎక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ‘హెల్మెట్ బ్యాంక్’ను సందర్శించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసులను అభినందించారు. అనంతరం స్వయంగా హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై కూర్చుని యువతకు ఆదర్శంగా నిలిచారు.
ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర అధికారులు ఉన్నారు. అంతకుముందు, ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలోని ‘స్వర ఆర్ట్ గ్యాలరీ’ స్టాల్‌లో గిరిజనులు రూపొందించిన ఓవర్‌కోట్‌ను కొనుగోలు చేసి అక్కడే ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి ఇలా బైక్‌పై కనిపించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించగా, ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.