'టచ్ మీ నాట్' మొక్కకు విచిత్ర సామర్థ్యం... తాజా పరిశోధనలో అద్భుత విషయం వెల్లడి
- 'టచ్ మీ నాట్' మొక్కకు వింత శక్తి
- సంఘటనలను కూడా లెక్కబెట్టగలవని నిర్ధారణ
- కణాల స్థాయిలోనే గుర్తుంచుకునే శక్తి
- విలియం అండ్ మేరీ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
సాధారణంగా ముట్టుకుంటే ముడుచుకునే ‘టచ్ మీ నాట్’ మొక్కకు వింత శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మొక్కకు సంఘటనలను లెక్కబెట్టే సామర్థ్యం ఉందని పరిశోధనలో తేల్చారు. మేధస్సు లేదా తెలివితేటలు కేవలం మెదడు ఉన్న జీవులకు మాత్రమే పరిమితం కాదని ఈ ఆవిష్కరణ నిరూపిస్తోంది.
విలియం అండ్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ విష్టన్, విద్యార్థి పేజ్ బార్టోష్‌ల బృందం ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది. పర్యావరణంలో వచ్చే మార్పులను అంచనా వేయడానికి ఈ మొక్కలు కేవలం సమయం మీద మాత్రమే ఆధారపడట్లేదని, అవి కాంతి మార్పుల ఫ్రీక్వెన్సీని ట్రాక్ చేస్తున్నాయని పీటర్ బృందం తమ పరిశోధనలో గుర్తించింది.
మొక్కలు కేవలం సమయాన్ని మాత్రమే లెక్కిస్తాయా లేక సంఘటనలను కూడా లెక్కబెట్టగలవా అని పరీక్షించడానికి పరిశోధకులు 24 గంటల పగలు, రాత్రి విధానాన్ని మార్చి చూశారు. వారు వెలుతురు, చీకటి సమయాలను పూర్తిగా రాండమ్‌గా మారుస్తూ ప్రత్యేక సైకిల్‌ను రూపొందించారు. ఈ ప్రయోగంలో ‘టచ్ మీ నాట్’ మొక్కలు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. వెలుతురు రావడానికి కొన్ని క్షణాల ముందే అవి తమ ఆకులను తెరవడం ప్రారంభించాయి. ఒక రెగ్యులర్ క్లాక్ ఫాలో అవ్వకుండా.. కాంతి ఎన్నిసార్లు మారిందో లెక్కబెట్టడం ద్వారానే మొక్కలు ఇలా ముందే ఊహించి స్పందించగలిగాయనే నిర్ధారణకు వచ్చారు.
ఈ పరిశోధన ఎవల్యూషనరీ బయాలజీలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రీయ నాడీ వ్యవస్థ లేకపోయినా జీవులు సంఖ్యలను ప్రాసెస్ చేయగలవని, పర్యావరణం నుంచి నేర్చుకోగలవని ఇది స్పష్టం చేస్తోంది. ఈ రకమైన ఇంటెలిజెన్స్ కణాల స్థాయిలో కొన్ని క్లిష్టమైన రసాయన లేదా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా పనిచేస్తుండొచ్చని పరిశోధకులు అంటున్నారు. కేవలం బ్రెయిన్ సెల్స్ మాత్రమే కాకుండా, ప్రతి జీవకణం సమాచారాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తు అవసరాలకు వాడుకోగలదని విష్టన్ వివరించారు.