రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్ షిప్... ఇంకా పెరిగే చాన్స్!

IPL 2024 Records Highest Viewership Ever
  • టీవీ, డిజిటల్‌కు కలిపి 1.1 బిలియన్ వ్యూస్
  • టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్కు క్రాస్
  • డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి
టాటా ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యూయర్‌షిప్ ఈ సీజన్‌లో వచ్చింది. మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల అనంతరం ప్రభుత్వాల ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగినప్పటికీ ఐపీఎల్ లీగ్ 19వ ఎడిషన్‌కు అభిమానుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు. టీవీ, డిజిటల్ కలిపి 1.1 బిలియన్ వ్యూస్ వచ్చాయని జియో హాట్ స్టార్ తెలిపింది.

టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్కును దాటినట్లు వెల్లడించింది. డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు జియో తెలిపింది. మ్యాచ్ వీక్షించిన సమయం 7 శాతం పెరిగినట్లు పేర్కొంది. వ్యూయర్‌షిప్ ప్రాంతీయ భాషల్లో 42 శాతం పెరిగిందని జియో వెల్లడించింది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో వ్యూయర్‌షిప్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది.

ఐపీఎల్ 2026 సీజన్‌ను అభిమానులు భారీగా అదరిస్తున్నారనేందుకు ఇదొక తార్కాణమని జియో స్టార్ సేల్స్ హెడ్ అనుప్ గోవిందన్ వెల్లడించారు. లీగ్ స్టేజ్‌లో ఇంకా మ్యాచ్ లు ఉన్నాయని, ప్రతి వారం పోటీల్లో తీవ్రత పెరుగుతోందని అన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున చూస్తున్నారని పేర్కొన్నారు. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న వేళ, జియోస్టార్ ప్రతిదానిని అభిమానులకు చేరువ చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు.
Go Back to Shorts
IPL 2024
Tata IPL
IPL viewership
Jio Hotstar
Indian Premier League
Cricket
Anup Govindan

More Telugu News