పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...!
- దేశ ఆహార భద్రతకు పామాయిల్ చాలా కీలకమని నిపుణుల అభిప్రాయం
- శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేన్నీ నిందించమని స్పష్టం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
- దిగుమతులు తగ్గించి, దేశీయంగా పామాయిల్ సాగును పెంచేందుకు కేంద్రం చర్యలు
- సోషల్ మీడియా ప్రచారంతో పామాయిల్‌పై అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన
- 2025-26 నాటికి సాగు లక్ష్యాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచిన ప్రభుత్వం
భారత్ వంట నూనెల భద్రతకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి పామాయిల్ చాలా కీలకమని నిపుణులు స్పష్టం చేశారు. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా పామాయిల్‌పై దుష్ప్రచారం చేయడం సరికాదని ఒక కార్యక్రమంలో వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ అంశంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కూడా స్పందించింది. శాస్త్రీయమైన, కచ్చితమైన ఆధారాలు లేకుండా ఏ ఆహార పదార్థాన్ని తాము ప్రోత్సహించబోమని, అలాగే తప్పుబట్టబోమని స్పష్టం చేసింది. పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన ఈ సదస్సులో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్ అల్కా రావు మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి అనువుగా ఉండటం వల్ల భారత గృహాలు, ఫుడ్ ఇండస్ట్రీలో పామాయిల్ వినియోగం కొనసాగుతోందని తెలిపారు.
భారత్ పామాయిల్ దిగుమతులు తగ్గించుకునేందుకు దేశీయ సాగును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిందని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు ఆర్థిక సలహాదారు డాక్టర్ శ్రీరిషి కాంత్ తెలిపారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే 2025-26 నాటికి పామాయిల్ సాగు లక్ష్యాన్ని 6.5 లక్షల హెక్టార్ల నుంచి దాదాపు 10 లక్షల హెక్టార్లకు పెంచినట్టు వెల్లడించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, డేటాను తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్లే పామాయిల్‌పై అపోహలు పెరిగాయని పీహెచ్‌డీసీసీఐ ప్రతినిధులు అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే నూనె పామాయిల్ అని, దీనికి దాని సామర్థ్యం, చౌకగా లభించడమే కారణమని వివరించారు. సరైన మోతాదులో తీసుకుంటే పామాయిల్ ద్వారా శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు అందుతాయని నిపుణులు పేర్కొన్నారు.