టీమిండియా ఎ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ... యువ ఆటగాళ్లకు చోటు

  • భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ 'ఏ' ముక్కోణపు సిరీస్
  • రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు
  • వైభవ్ సూర్యవంశీకి చోటు
వచ్చే నెల శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్‌లో స్టార్ ఎడమచేతి వాటం ఆటగాడు తిలక్ వర్మ ఇండియా 'ఎ' పురుషుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్టు కూడా పాల్గొంటున్న ఈ సిరీస్ కోసం బీసీసీఐ గురువారం భారత ఎ జట్టును ప్రకటించింది.

యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. దేశవాళీ క్రికెట్‌‍లో రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా భారత్ 'ఏ' జట్టులోకి ఎంపికయ్యాడు.

భారత 'ఏ' జట్టులో హిట్టర్లకు కొదవలేదు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ విధ్వంస బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉండగా, మిడిల్ ఆర్డర్‌లో ఆయుష్ బదోని, రమణ్‌దీప్ సింగ్ వంటి ఫినిషర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో స్పిన్, ఫేస్ విభాగాల్లో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు. ఈ ముక్కోణపు సిరీస్ టైటిల్ కోసం మాత్రమే కాకుండా, యువ ఆటగాళ్ళకు సీనియర్ జట్టులోకి వెళ్ళడానికి మంచి అవకాశం. జూన్ 9వ తేదీన ముక్కోణపు పోరు ప్రారంభం కానుంది.

ఇండియా 'ఏ' స్క్వాడ్

తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యవంశ్ షెడ్జె, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్ర, విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్ వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్ ఉన్నారు.

Tilak Varma
India A
Sri Lanka
Riyan Parag
Vaibhav Suryavanshi
Afghanistan A
Cricket
BCCI
Abhishek Sharma
Ayush Badoni

More Telugu News